చిరు సినిమా కోసం రెండున్నర కోట్లు డిమాండ్ చేసిన ఆ హీరోయిన్

చిరు సినిమా కోసం రెండున్నర కోట్లు డిమాండ్ చేసిన ఆ హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ గా, ఎండోన్మెంట్ అధికారిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇకపోతే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ప్రస్తుత కాలంలో భయంకరంగా వ్యాపిస్తున్నటువంటి కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కొద్దీ రోజులు ఆపేశారని సమాచారం. అసలు విషయం ఏంటంటే… ఈ చిత్రంలో చిరు సరసన నటించేది ఎవరు అనే అంశం అందరిని కూడా ఆలోచింపజేస్తుంది.

అయితే ఇటీవలే ఈ చిత్రం నుండి త్రిష తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా త్రిష ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి కాజల్ ని సంప్రదించగా, చిరు తో కలిసి నటించేందుకు అంగీకారం తెలిపింది. అయితే ఈ చిత్రంలో నటించడానికి కాజల్ అధికమొత్తంలో తన రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందని సమాచారం. అంటే ఈ సినిమాకు గాను దాదాపుగా రెండున్నర కోట్లు రెమ్యూనరేషన్ కావాలని అడిగిందట కాజల్… కానీ చివరికి రెండు కోట్లకు నిర్మాతలు కాజల్ ని ఒప్పించారని సమాచారం. ఇకపోతే తొందర్లోనే కాజల్ ఈ ఆచార్య అనే చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది కూడా…