కల్కి – షారుఖ్ ఇంటి ముందు హైలైట్

కల్కి - షారుఖ్ ఇంటి ముందు హైలైట్
Cinema News

స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా తెర‌కెక్కుతున్న తాజా మూవీ ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ మూవీ కి మ‌హాన‌టి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా.. మే 09 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ కోసం నాగ్‌ అశ్విన్‌ టీం గ్రాండ్‌ ప్రమోషనల్‌ ప్లాన్‌ రెడీ చేసుకుంది.

కల్కి - షారుఖ్ ఇంటి ముందు హైలైట్
Kalki 2898AD

ఇప్ప‌టికే ఈ మూవీ లో న‌టిస్తున్న రైడర్స్‌ని బాంబేలోని ఒక ఈవెంట్లో ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మోష‌న్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజాగా ఈ రైడ‌ర్స్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇంటిముందు నిలుచున్నారు. కల్కి చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసిన రిలీజ్ పోస్ట‌ర్‌ని ప‌ట్టుకుని మ‌న్న‌త్ ముందు రైడర్స్ నిలుచున్నారు. దీంతో ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారాయి.