వైర‌ల్ అవుతున్న క‌త్రినా కైఫ్ హెయిర్ టైయింగ్ ఫన్నీ వీడియో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. వెండితెరపై అందాల విందు చేసి చాలా కాలమే అవుతుంది. సల్మాన్‌ఖాన్‌తో ఈమె న‌టించిన భారత్ సినిమా త‌ర్వాత న‌టించిన సూర్య‌వంశీ కోవిడ్ ఎఫెక్ట్‌తో ఇంకా థియేట‌ర్స్‌లోకి రాలేదు. ప్ర‌స్తుతం భూత్ పోలీస్ సినిమాతో బిజీగా ఉన్న ఈ పొడుగు కాళ్ల సుంద‌రి, సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది. జిమ్ వీడియోలు, గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ వ‌స్తున్న క‌త్రినా కైఫ్‌.. రీసెంట్‌గా ఓ ఫ‌న్నీ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో క‌త్రినా త‌న పొడ‌వాటి జుట్టుని కొన్ని సెకన్స్‌లోనే ఎలా ముడివేసుకోవాల‌నే హెయిర్ ట్రిక్‌ను చేసి చూపించింది. ఈ వీడియో చూసిన వారు క‌త్రినా టాలెంట్‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేరు.