ఆర్ఆర్ఆర్: రాజమౌళి మరో భారీ ప్లాన్?

దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలను ఎంత భారీగా తెరకెక్కిస్తారో అంతే భారీగా మార్కెటింగ్ కూడా చేస్తారు. సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా రాజమౌళిది అందె వేసిన చేయి. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీయార్, రామ్‌చరణ్‌తోపాటు పలు భాషలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతున్నది .

Ajay Devgn Alia Bhatt Entry In S.S. Rajamouli Movie RRR - RRR: 'बाहुबली' के  डायरेक्टर राजामौली के साथ काम करेंगे अजय देवगन और आलिया भट्ट, अंदर जानें  पूरी डिटेल | Patrika News

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా చాలా రోజుల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ సినిమా తెలుగుతోపాటు దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. అందుకే వినూత్నంగా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేసి విడుదల తేదీ సమయానికి అన్ని భాషల్లోనూ హైప్‌ను మరింత పెంచాలనుకుంటున్నారట. ముఖ్యంగా హీరోలకు బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకొచ్చే విధంగా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట.