వైరల్ అవుతున్న కత్రినా కైఫ్ ఫోటోలు

దేశంలో కరోనా వైరస్ పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీనితో ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుండడంతో ప్రజలంతా ఎక్కువ మేరకు ఇళ్ళకే పరిమితం కావలసి వచ్చింది.అయితే ఇలాంటి నేపధ్యంలో పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు ఇంట్లోనే ఉంటూ తమ ఇంటి పనులను చేస్తూ కనిపిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజాగా చేత్తో చీపురు పట్టి తన ఇంట్లో ఓ గదిని శుభ్రపరిచింది.

 దేశవ్యాప్తంగా కరోనా ధాటికి అన్ని రంగాలు మూతపడ్డాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ షూటింగ్స్ అన్ని ఆపేసింది. దీంతో హీరోలు, హీరోయిన్స్ ఇంట్లో ఖాలీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ కాలం గడుపుతున్నారు. అందులో భాగంగా అందాల భామ కత్రినా కూడా తాను తిన్న గిన్నెలు తోముతూ దానికి సంబందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.ఏదేమైనా నిత్యం షూటింగ్‌లు, సినిమాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్రెటీలు ఇలా ఇంటి పనులు చేస్తుండడంతో వారి పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.