వెబ్ సిరీస్ లో కనిపించనున్న కట్టప్ప

వెబ్ సిరీస్ లో కనిపించనున్న కట్టప్ప

దక్షిణాది చిత్రాలలో హీరోగా కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రధాన పాత్రలను పోషిస్తున్న నటుడు సత్యరాజ్. ఎక్కువగా తమిళం తెలుగు బాషలలో కనిపించే ఆయన ఇటీవల కొన్ని తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో చివరిగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో కన్పించిన సత్యరాజ్ మళ్లీ ఏ తెలుగు చిత్రాలకు సైన్ చేయలేదు. కానీ ఈ మధ్య సత్యరాజ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఇప్పటి వరకు వెండితెర పై కన్పించిన ఆయన త్వరలోనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్ లోకి రానున్నాడట. మిర్చిలో తండ్రి పాత్రతో మంచిపేరు రాగా బాహుబలిలో కట్టప్ప పాత్ర సత్యరాజ్ ని ఇంటర్నేషనల్ స్టార్ గా నిలబెట్టింది. మరి అలాంటి సత్యరాజ్ వెబ్ వరల్డ్ లోకి వస్తున్నాడంటే ఆయన అభిమానులలో ఆసక్తి నెలకొంది. అంతటి స్టార్ ఒప్పుకున్నారంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఉందేమో ఆ కాన్సెప్ట్ లో అని భావిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కి ‘ది పర్ఫెక్ట్ హస్బెండ్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. తమిరా దర్శకత్వంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ గురించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.