రాజమౌళి సినిమాలో మొదటి హీరోయిన్‌ ఫిక్స్‌

Keerthy Suresh Confirm To Rajamou

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెల్సిందు. రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు ఈ చిత్రంలో నటించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌ కోసం చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి ఎంతో మందిని పరిశీలించిన తర్వాత కీర్తి సురేష్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. తమిళనాట కీర్తి సురేష్‌కు స్టార్‌డం ఉంది. అందుకే అక్కడ ఈమె సినిమాలో నటిస్తే మల్టీస్టారర్‌ మూవీకి మంచి క్రేజ్‌ ఉంటుందని జక్కన్న భావిస్తున్నాడు. ఇక రెండవ హీరోయిన్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

రాజమౌళి సినిమాలో మొదటి హీరోయిన్‌ ఫిక్స్‌ - Telugu Bullet

కథానుసారంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ ఉంటారట. ముగ్గురిలో ఒక హీరోయిన్‌ ఇంగ్లీష్‌ బ్యూటీ అనే సమాచారం అందుతుంది. పల్లెటూరి నేపథ్యంతో పాటు, పీరియాడిక్‌ మూవీ అవ్వడం వల్ల అందుకు తగ్గ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని జక్కన్న వివ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కీర్తి సురేష్‌ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసిన నేపథ్యంలో ఇక రష్మిక పేరు పరిగణలోకి తీసుకోబడదు అనే సమాచారం అందుతుంది. బాలీవుడ్‌ నుండి మరో హీరోయిన్‌ను ఇంపోర్ట్‌ చేసే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌ జక్కన్న మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. జక్కన్న దర్శకత్వంలో హీరోయిన్స్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈచిత్రంలో కూడా హీరోయిన్స్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం అందుతుంది.