‘కృష్ణార్జున యుద్దం’ ప్రివ్యూ

Krishnarjuna Yuddham movie Preview

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరం వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్న నాని ఈ సంవత్సరం ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రంతో తన సక్సెస్‌ రికార్డును కొనసాగించేందుకు సిద్దం అయ్యాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్‌ ముందు మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో నానికి మాస్‌లో మరింత ఇమేజ్‌ పెరుగుతుందనే నమ్మకంను దర్శకుడు గాంధీ వ్యక్తం చేస్తున్నాడు. ట్రైలర్‌ మరియు టీజర్‌లు కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.

నాని గతంలో ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో డబుల్‌ రోల్‌ చేశాడు. మళ్లీ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు. రికార్డు స్థాయిలో ఈ చిత్రం నానికి వసూళ్లు తీసుకు వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. నాని హీరో రెండు విభిన్న పాత్రల్లో నటించి తన నటన ప్రతిభను చూపించనున్నాడు. కృష్ణ, అర్జున పాత్రల్లో నాని నటన సూపర్బ్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా నాని కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కృష్ణార్జున యుద్దం చిత్రంతో ‘రంగస్థలం’ చిత్రం కలెక్షన్స్‌ జోరు తగ్గనుందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చరణ్‌ దూకుడును నాని ఆపుతాడా అనేది రేపు తేలిపోనుంది.