చిత్తూరు మొత్తం ప‌ల‌క‌ల శ‌బ్దం విన‌ప‌డాల‌…

Krishnarjuna Yuddham movie Dhaari Choodu Full Song released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పార్టీనా… అని అంత మెల్ల‌గా అడుగుతారేందిరా… చిత్తూరు మొత్తం మ‌న ప‌ల‌క‌ల శబ్దం వినప‌డాల… స్టార్ట్ మ్యూజిక్… దారి చూడు… దుమ్ము చూడు మామ‌… యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఈ పాట నేచుర‌ల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలోనిది. క‌నుమ సంద‌ర్భంగా ఈ మాస్ పాట‌ను నాని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. పెంచ‌ల్ దాస్ ఈ పాట పాడారు. మేర్ల‌పాకి గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో నాని కృష్ణ‌, అర్జున్ గా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

భోగి రోజు కృష్ణ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన నాని… సంక్రాంతి సంద‌ర్భంగా అర్జున్ ను ప‌రిచ‌యం చేశారు. నాని స‌ర‌స‌న అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్సార్ మిర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న నానికి కృష్ఝార్జున యుద్ధం రూపంలో మ‌రో విజ‌యం ల‌భిస్తుంద‌ని ఆయ‌న అభిమానులు ధీమాగా ఉన్నారు. కృష్ణార్జున యుద్ధం అన్న టైటిల్ పాత‌దైన‌ప్ప‌టికీ… సినిమా మాత్రం ఇప్ప‌టి ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ అంటోంది. నాని రెండోసారి డ‌బుల్ రోల్ చేస్తుండ‌డంతో ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి.