రాము మొదటి మాట విని కీరవాణి సంతకం పెట్టాడేమో.

MM Keeravani Music Composed of RGV God Sex and Truth video

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కీరవాణి… బాహుబలి, అన్నమయ్య, శ్రీరామదాసు, క్రిమినల్, క్షణం క్షణం లాంటి భిన్నమైన చిత్రాలకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ప్రతిభ పాటవాలు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పనిచేసిన సినిమాల సంగీతం వింటే చాలు ఆయన ఏమిటో అర్ధం అవుతుంది . పేరు వుంది కదా అని డబ్బులు వస్తాయి కదా అని ఏదిపడితే ఆ సినిమా చేయడానికి కీరవాణి ఎప్పుడూ వ్యతిరేకం. అందుకే ఆయన సినిమాల రాశి కన్నా వాసి ఎక్కువ. కంటెంట్ బాగుంటే ఎంత చిన్న సినిమాకైనా పనిచేసే కీరవాణి విషయం లేకపోతే ఎంత పెద్ద ఆఫర్ కైనా నో చెప్పేస్తారు. అలాంటి కీరవాణి ఇప్పుడు పోర్న్ స్టార్ మియా మాల్కోవతో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న వీడియో కి మ్యూజిక్ ఇవ్వడం సంగీత ప్రపంచంలో హాట్ టాపిక్.

నిజానికి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కి మియా, రాము పని చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, రాము ఆడియో వింటే మాత్రం ఇదేదో మాములు శృంగారభరిత వీడియో అనుకోడానికి వీల్లేదు. శృంగారం గొప్పదనంతో పాటు ఆడతనం భావాలు, ఓ తాత్వికత అందులో కనిపిస్తున్నాయి. అందుకే వాసికి ప్రాధాన్యం ఇచ్చే కీరవాణి ఈ వీడియో కి నేపధ్య సంగీతం అందించి వుంటారు. అయితే ఈ విషయం గురించి టాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు సరదాగా ఓ కామెంట్ చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమాలతో పాటు కీరవాణి ఈ మధ్య ఎక్కువగా భక్తి సినిమాలకే పని చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని “రాము సినిమా టైటిల్ గురించి గాడ్ అని చెప్పగానే కీరవాణి ఓకే చేసి వుంటారు. కానీ తర్వాత సెక్స్ గురించి విన్నా వెనక్కి రాలేకపోయి వుంటారు “ అన్న ఆ డైరెక్టర్ కామెంట్స్ విని అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు.