ప్ర‌తి ప‌దం నిన్ను ఉద్దేశించిన‌దే…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవ‌లే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన భార్య వెరోనికాకు ఓ పాట‌ను అంకిత‌మిచ్చాడు మంచు విష్ణు. ఆయ‌న తాజాచిత్రం ఆచారి అమెరికా యాత్రలోని చెలియా… చెలియా… అరెరె… నేన‌నుకున్నానా… క‌ల‌నైనా క‌ల‌గ‌న్నానా… అంటూ సాగే పాట‌ను ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన విష్ణు దానితో పాటు భార్య‌ను ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఈ పాట‌ను వెరోనికాకు ప్రేమ‌గా అందిస్తున్న‌ట్టు తెలిపారు.

న‌న్ను అమితంగా ప్రేమించే అంద‌మైన మ‌హిళ‌కు ఈ పాట అంకితం. ఈ పాటలోని ప్ర‌తి ప‌దం నిన్ను ఉద్దేశించిన‌దే. ఇందులోని ప్ర‌తిప‌దం నీపై నాకున్న ప్రేమ‌ను తెలుపుతుంది. హ్యాపీ బ‌ర్త్ డే మై ల‌వ్ అని మెసేజ్ పెట్టాడు. ఆచారి అమెరికా యాత్ర‌లో విష్ణు స‌ర‌స‌న కంచె ఫేం ప్రజ్ఞాజైశ్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ నెల 26న రిప‌బ్లిక్ డే కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమాతో పాటు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ పోషిస్తున్న‌గాయ‌త్రి సినిమాలోనూ మంచు విష్ణు న‌టిస్తున్నాడు.

Vishnu Manchu Tweets about his wife