రజని, కమల్ ఒకే సారి ఆ పని చేస్తారా ?

Rajinikanth Kamal Haasan to Start Political Tour in Tamil Nadu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ రంగప్రవేశంతో తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగేలా వున్నాయి. వీళ్ళు రాజకీయాల్లోకి వస్తాం అని అన్నారు గానీ పార్టీ పెట్టినప్పుడు చూద్దాం లే అనుకున్న వాళ్లకి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు షాక్ ఇస్తున్నారు. త్వరలో రాష్ట్ర పర్దటనకు బయలుదేరేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తమిళ పత్రిక ఆనంద్ వికటన్ లో ఓ కాలమ్ రాస్తున్న కమల్ తాజాగా తాను తమిళనాడు పర్యటన చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు. వచ్చే వారం పర్యటన షెడ్యూల్ సహా ఇతర వివరాలు వెల్లడించనున్నట్టు కమల్ వివరించారు. కమల్ బయటకు చెప్పకపోయినా మార్చి లో ఆయన రాష్ట్ర పర్యటన ఉండొచ్చని తెలుస్తోంది, ఆ పర్యటన సమయంలోనే ఆయన కొత్త పార్టీకి సంబంధించిన విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉందట.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మార్చి లేదా ఏప్రిల్ లో ఓ నెల రోజుల పాటు తమిళనాడు పర్యటనకు సన్నద్ద్ధం అవుతున్నట్టు సమాచారం వుంది. ఇప్పుడు విడుదలకి సిద్ధం అవుతున్న రోబో 2.0 తో పాటు కాలా రిలీజ్ తర్వాత సినిమా రంగం నుంచి తప్పుకోడానికి రజని ఏర్పాట్లు చేసుకుంటున్నారట. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన చేసి వెనువెంటనే తమిళనాడు పర్యటన చేస్తే ఇటు రాజకీయానికి, అటు సినిమాలకి కూడా పనికి వస్తుందన్న ఆలోచనలో ఉన్నారట రజని. అంతా అనుకున్నట్టు జరిగితే రజని, కమల్ ఒకే సారి తమిళనాడు లో పర్యటనకు బయలుదేరే ఛాన్స్ కనిపిస్తోంది.