సంక్రాంతి సీజన్‌ పూర్తిగా వృదా

Agnyaathavaasi Movie and Jai Simha Movie flop talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్‌ ఏ రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్‌లో తమ సినిమాలతో సందడి చేస్తారు. ప్రతి సంక్రాంతికి కూడా కనీసం మూడు నాలుగు సినిమాలు అయినా బాక్సాఫీస్‌ ముందు సందడి చేసేందుకు వస్తాయి. అన్ని సంక్రాంతుల మాదిరిగానే ఈ సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి సీజన్‌ అంటే గత మూడు నాలుగు సంవత్సరాల్లో వందల కోట్ల బిజినెస్‌ జరుగుతూ ఉండేది. గత సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, శర్వానంద్‌లు కలిసి ఏకంగా 250 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించారు. కాని ఈసారి మాత్రం సంక్రాంతి సీజన్‌ పూర్తిగా వృదా అయ్యింది.

సంవత్సరం సంవత్సరంకు మారుతున్న పరిస్థితులు మరియు పెరుగుతున్న టికెట్ల రేట్ల కారణంగా ఈ సంక్రాంతికి ఏకంగా 350 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు భావించారు. కాని తీరా చూస్తే పండుగ సీజన్‌కు విడుదలైన మూడు సినిమాలు కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. 350 కోట్లు అనుకున్న కలెక్షన్స్‌ కనీసం 100 కోట్లు కూడా చేరుకోలేక పోయాయి. ముఖ్యంగా అజ్ఞాతవాసి మరియు జైసింహాలు డిస్ట్రిబ్యూటర్లకు దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చింది. ఏమాత్రం ఆశాజనకమైన కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది. మూడు సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో సంక్రాంతి సీజన్‌ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని ట్రేడ్‌ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.