మంచు వారసుడు మరో భక్తుడు..

Manchu Vishnu Son Name Avram Bhaktha
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి మనవడు పుట్టిన విషయం తెలిసిందే. ఆ మంచు వారసుడికి తాత మోహన్ బాబు పేరు కలిసి వచ్చేలా పేరు కూడా పెట్టేసారు. ఇంతకీ ఆ పేరు ఏమిటో తెలుసా ? ఆవ్రామ్ భక్త. ఆవ్ రామ్ అంటే ఎవరూ ఆపలేరు అని అర్ధమట. ఇందులో మోహన్ బాబు పేరు ఎక్కడుంది అని అనుకుంటున్నారా ?. మోహన్ బాబు అసలు భక్తవత్సలం నాయుడు. ఇప్పుడు కొడుకు పేరులో చివరి భక్త మోహన్ బాబు అసలు పేరులో ని ముందు మాట.

విష్ణు కి ఇంతకుముందు ఇద్దరు కవలలు. వాళ్ళు అరియానా, విరియానా. ఇప్పుడు చిట్టి తమ్ముడికి వాళ్ళు అప్పుడే నిక్ నేమ్ కూడా పెట్టేసుకున్నారు. అరియానా తన తమ్ముడిని తాత గుర్తుకు వచ్చేలా బేబీ లయన్ అని పిలుస్తుంటే, విరియానా మాత్రం బేబీ టెడ్డి బేర్ అంటోందట. ఈ విషయాలు అన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుని విష్ణు తెగ మురిసిపోతున్నాడు. ఇక మనవడి పుట్టుక, ఆ పిల్లవాడికి తన పేరు పెట్టడంతో మోహన్ బాబు సందడి, హడావిడి ఓ రేంజ్ లో ఉందని మంచు వారి కుటుంబ సభ్యులే మురిపెంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి మంచు వారి వారసుడుగా ఇంకో భక్తుడు వచ్చాడు.

Vishnu says his Son Name on Twitter

Manchu Manoj tweets on Vishnu son Name