ప్రదీప్ కారు వెనుక సీట్ లో అసలు కిటుకు.

Girls Found in anchor Pradeep car
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రదీప్ కావడానికి యాంకర్ అయినా కాస్త ఫ్యామిలీ టైపు ఇమేజ్ సంపాదించుకున్నాడు. అందుకే జనవరి 1 వేడుకల సందర్భంగా ప్రదీప్ తప్పతాగి కారు నడుపుతూ పోలీసులకి దొరికిపోయాడు అనగానే పెద్దగా ఎవరూ నమ్మలేదు. కానీ టీవీల్లో వస్తున్న దృశ్యాలు చూసేసరికి నమ్మక తప్పలేదు. తాగి కారు నడిపి దొరికిపోయిన విషయం ప్రపంచం అంతా తెలిసిపోయాక పోలీస్ కౌన్సిలింగ్ కి రాకుండా ప్రదీప్ తప్పించుకుపోవడం మాత్రం ఆయన్ని అభిమానించే వాళ్లకు కూడా పెద్ద షాక్.

ప్రదీప్ పోలీస్ కౌన్సిలింగ్ కి హాజరు అయితే, ఆపై కోర్టుకి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ తప్పు ఒప్పుకుంటే జరిమానా లేదా ఓ వారం లోపు జైలు శిక్ష పడేది. అప్పుడు ఏమి జరిగినా ఆ ఎపిసోడ్ అంతటితో అయిపోయేది. అలా కాకుండా ఇప్పుడు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగడంతో అతను పరారీలో ఉన్నట్టు అయ్యింది.విషయం ట్రాఫిక్ పోలీసుల నుంచి సివిల్ పోలీసుల దాకా వెళ్ళింది. తప్పించుకు తిరుగుతున్న అతన్ని పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టే బాధ్యత సివిల్ పోలీసుల మీద ఎప్పుడైతే పడిందో అప్పుడే ప్రదీప్ మీద ఇంకో కేసు అదనంగా వచ్చి పడింది.

చదువుకుని అంతోఇంతో పద్ధతిగా వ్యవహరించే ప్రదీప్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఏమి చేసినా ప్రదీప్ తప్పించుకునే ఛాన్స్ లేదు. అది తెలిసి కూడా అతను పోలీసులకి తెలియకుండా వెళ్లడం గురించి భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. ఆ రోజు ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకి దొరికినప్పుడు కారు వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు ఎవరు అన్న అంశం మీదకి దృష్టి మళ్లింది.

ప్రదీప్ తో పాటు ఆ రోజు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కుమార్తె ఉందట. ప్రదీప్ నోరు విప్పితే ఆ విషయాలు ఎక్కడ బయటకు వస్తాయో అన్న భయంతో ఆ నాయకుడు కొంత కాలం పాటు ప్రదీప్ పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్నాడట. ఇది కావాలని పుట్టించిన పుకారా లేక నిజంగానే అలా జరిగిందా అన్నది ప్రదీప్ నోరు విప్పితే కానీ చెప్పలేం. ప్రదీప్ కారు వెనుక సీటు కిటుకులో నిజం ఏదైనా అతను పోలీసుల దగ్గరికి వెళ్లకుండా తప్పు చేస్తున్నాడని మాత్రం చెప్పక తప్పదు.