ఆచారి ఇంకాస్త ఆగితే ఏమైంది?

vishnu achari america yatra movie release on april 27

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మంచు విష్ణు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యి, సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. గత మూడు నెలలుగా ఈ చిత్రం విడుదలకు సిద్దం అయినా కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 27న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లు వేచి చూసిన మంచు విష్ణు ఇంకొన్ని రోజులు ఎదురు చూస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇటీవలే విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. ఇదే సమయంలో మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాలతో బాక్సాఫీస్‌ ఫుల్‌ సందడిగా ఉండే అవకాశం ఉంది. భరత్‌ అనే నేను కనీసం రెండు వారాల పాటు భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ఆ వెంటనే అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం మే మొదటి వారంలో విడుదల కాబోతుంది. అంటే భరత్‌ అనే నేను మరియు నా పేరు సూర్య చిత్రాలకు మద్యలో ‘ఆచారి అమెరికా యాత్ర’ రాబోతుంది. రెండు చిత్రాలు కూడా భారీ అంచనాలున్న నేపథ్యంలో ‘ఆచారి అమెరికా యాత్ర’కు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాకపోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆచారి ఇన్నాళ్లు వేచి ఉండి ఇప్పుడు హడావుడిగా ఫుల్‌ పోటీ సమయంలో వస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అంటున్నారు.