వర్మను వదిలేది లేదంటున్న సైబర్‌

Case Files On Ram Gopal Varma over GST Video Shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను ‘జీఎస్టీ’ చిత్ర వివాదం ఇప్పట్లో వదిలేలా లేదు. భారత చట్ట ప్రకారం పోర్న్‌ చిత్రాలను చిత్రీకరించడం నేరం. అయితే జీఎస్టీ చిత్రాన్ని వర్మ ఇండియాలో చిత్రీకరించలేదు అని, పోలాండ్‌లో చిత్రీకరించాను అంటూ చెబుతున్నాడు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్‌లో చిత్రీకరించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు సామాజిక కార్యకర్త దేవిని దూషించిన కారణంగా కూడా ఆయనపై సైబర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలో రెండు సార్లు వర్మను పోలీసులు విచారించారు. తాజాగా మరోసారి వర్మను విచారించేందుకు సిద్దం అవుతున్నారు.

మియా మాల్కోవాను హైదరాబాద్‌ పిలిపించి ఇక్కడే చిత్రీకరణ చేయడంతో పాటు, ఆ చిత్ర ఎడిటింగ్‌ మరియు రికార్డింగ్‌ అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేశారు అంటూ పోలీసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం ఆ చిత్రంకు తనకు ఎలాంటి సంబంధం లేదని, విదేశీ నిర్మాణ సంస్థ తనకు పారితోషికం ఇస్తే అక్కడకు వెళ్లి సినిమాను చిత్రీకరించి వచ్చాను, వారే సినిమాను అప్‌లోడ్‌ చేశారు అంటూ వర్మ చెబుతున్నాడు. కాని వర్మ మాటలు నిజం కాదని, ఇండియాలోనే చిత్రీకరించి, ఇండియాలోనే ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్‌ చేశారు అంటూ ఫిర్యాదు చేసిన వారు చెబుతున్నారు. మొత్తానికి వర్మపై ఉన్న రెండు కేసుల్లో ఏ ఒక్కటి నిరూపితం అయినా కూడా కఠిన శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.