మాల్యా ఇంట్లోనే జగన్ కూతురు ! నిజమెంత ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టి లండన్ చెక్కేసి విలాస జీవితం అనుభవిస్తున్న విజయమాల్యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయారు.

విజయ మాల్యాను ఇటు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. అసలు కర్ణాటక కేంద్రంగా వ్యాపారాలు చేసి బ్యాంకు రుణాలు పొంది అవి కట్టకుండా విదేశాలకి వెళ్ళిపోయిన మాల్యా పారిపోయేనాటికి ఒక రాజ్యసభ ఎంపీ కాని కోర్టులో వేసిన కేసుల వల్ల ఆయన పారిపోయిన కొన్ని రోజులకి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఈ పాయింట్ ని ఉపయోగించుకుని ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డిని విజయమాల్యాతో పోల్చారు.

విజయసాయి రెడ్డి ఆర్థిక నేరగాడని, విజయ్ మాల్యా లాగానే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో విజయసాయిరెడ్డికి ఏం పనని…ఆయన కేసుల మాఫీ కోసమే పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతేకాదు విజయసాయి రెడ్డి పీఎంవోని విశ్రాంతి మందిరంగా భావిస్తున్నారని, వారి వద్ద మెప్పులు పొంది తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా చంద్రబాబు ఆరోపించారు. విజయ్ మాల్యా కంటే ఆర్థిక నేరగాడు విజయసాయి అని ఆయన తీవ్రస్వరంతోనే విరుచుకుపడ్డారు.

ఇదే విషయంగా తాజాగా విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016 మార్చి నెలలో చంద్రబాబు లండన్ కు వెళ్లి విజయ్ మాల్యాను కలిశారన్నారు. విజయ్ మాల్యాను చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలన్నారు అలాగే 2014 ఎన్నికలకు ముందు విజయ్ మాల్యా నుంచి టీడీపీ 150 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా తీసుకుందని కూడా విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విజయ్ మాల్యాను కలిసిన తేదీలను కూడా ఆయన చెప్పడం విశేషం.

అయితే దీనికి టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. విజయ్ మాల్యాను కలిసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించింది.
ఇలా చిన్నగా మొదలయిన ఇష్యూ బిగ్ టర్న్ తీసుకోనుందని తెలుస్తోంది. ఇప్పుడు విరాళాల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ నేతల మీదకే వచ్చింది. విజయ్ మాల్యా తో వైసీపీ నేతలకు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో మొత్తం కూడా బయటకి వచ్చాయని సోషల్ మీడియా కోడిఅయి కూస్తోంది. వాటిలో ముఖ్యమైనది లండన్ లో చదువుకుంటున్న జగన్ కూతురు ప్రస్తుత నివాసం.. విజయ్ మాల్యా ఇంట్లోనేనట..!

అయితే ద్రువీకరించని ఈ విషయం మాత్రం సోషల్ మీడియా లో తెగ షేర్ అవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… టీడీపీ ఎంపీగా ఎన్నికయిన ఉన్న డీకే ఆదికేశవులునాయుడును..ఆపరేషన్ ఆకర్ష లో భాగంగా తన వైపుకు తిప్పుకున్నారు. స్వతహాగా లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్న ఆదికేశవులు నాయుడు…విజయ్ మాల్యా కి వ్యాపార భాగస్వామి. ఆదికేశవులు నాయుడు పరిచయం చేసిన పరిచయం కాస్తా సన్నిహితంగా మారింది.

అప్పట్లో కాంగ్రెస్ కు ..గత ఎన్నికలకు ముందు వైసీపీ కూడా.. విరాళాలు..లిక్కేర్ కింగ్ కి చెందిన యూబీ గ్రూప్ నుంచి అందాయట. ఆ సాన్నిహిత్యంతోనే లండన్ లో చదువుకునేందుకు అర్హత సాధించిన కుమార్తె బాగోగులు చూసుకునేందుకు… అక్కడే ఉంటున్న విజయ్ మాల్యా సహకారం కోరాడంతో లండన్ లో తనకు ఉన్న ఓ ఇంటిని జగన్ కూతురి కోసం విజయ్ మాల్యా కేటాయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అంతేకాకుండా అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు జగన్ విజయ్ మాల్యా ని కూడా కలిశారంట. అయితే జగన్ కి ఇన్ని సన్నిహిత సంభందాలు పెట్టుకుని విజయ సాయి చంద్రబాబు ని విమర్శించడం కూడా అనుమానాలకి తావిస్తోంది. త్వరలోనే విజయ సాయి జండా పీకేసి బీజేపీ గూటికి చేరుతాడా అనే అనుమానాలని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.