కేటీఆర్‌కు నచ్చని ‘కాదలి’!

ktr in kaadali movie premier show

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చిన్ననాటి స్నేహితుడు పట్టాభి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాదలి’.  అంతా కొత్త వారితో ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పోస్టర్స్‌తో పాటు, ట్రైలర్‌ విభిన్నంగా ఉండటంతో పాటు, ఆకట్టుకునే కథనం ఈ చిత్రంలో ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అందుకే సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రత్యేక షోను నేడు హైదరాబాద్‌లో వేయడం జరిగింది. ఈ ప్రత్యేక షోకు కేటీఆర్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు మరియు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.

సినిమా నడుస్తున్న సమయంలోనే కేటీఆర్‌ వెళ్లి పోవడం జరిగింది. సినిమా నచ్చక కేటీఆర్‌ వెళ్లి పోయాడు అనే టాక్‌ వినిపిస్తుంది. అయితే కొందరు మాత్రం కేటీఆర్‌ మంత్రి అయిన కారణంగా చాలా బిజీ షెడ్యూల్‌ ఉంటుంది. రాజకీయ కారణాల వల్ల వెళ్లి పోయి ఉంటాడు అని కొందరు అంటున్నారు. మొత్తానికి కేటీఆర్‌ ‘కాదలి’ చిత్రాన్ని ఓ రేంజ్‌లో ప్రమోట్‌ చేసి, చివరకు సినిమా మద్యలోనే వెళ్లి పోయి నెగటివ్‌ రెస్పాన్స్‌ వచ్చేలా చేశాడు. ఈ విషయమై దర్శకుడు పట్టాభి కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో దర్శకుడు ఉన్నాడు. రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేసేందుకు సిద్దం చేశారు.