ఇంద్రగంటి యాక్సిడెంట్‌ ఒక పెద్ద..!

Shocking News Of Director Mohanakrishna Indraganti Accident

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు మూడు రోజులు గా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి యాక్సిడెంట్‌ అయ్యిందని, ఆయన సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా ప్రాణాలతో బతికి పోయాడు అంటూ ఓ రేంజ్‌లో వార్తలు వస్తున్నాయి. తాజాగా ‘అమీతుమీ’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి అదృష్టంకొద్ది బతికి పోయారు అని, లేదంటే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లే వారు అంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అన్ని మీడియా సంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఇంద్రగంటి యాక్సిడెంట్‌ వార్తలు పెద్ద జోక్‌ అని తేలిపోయింది.

తనకు యాక్సిడెంట్‌ అయినట్లుగా మీడియాలో వస్తున్న వార్తల గురించి స్పందిస్తూ దర్శకుడు షాక్‌ అయ్యాడు. తనకు సంవత్సరం క్రితం అయిన యాక్సిడెంట్‌ను ఇప్పుడు అయ్యిందంటూ ప్రచారం చేయడం తనకు షాకింగ్‌గా ఉందని, అప్పుడు అదొక చిన్న యాక్సిడెంట్‌ మాత్రమే అని, కాని ఇప్పుడు దాన్నో పెద్ద యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. అసలు గత సంవత్సరం జరిగిన యాక్సిడెంట్‌ను ఈసంవత్సరం యాక్సిడెంట్‌గా చిత్రీకరించడం ఆశ్చర్యంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది తప్ప, ఏది నిజం, ఏది అబద్దం అనే విషయాన్ని మాత్రం గ్రహించడం లేదు అంటూ ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆయన అన్నదాంట్లో నిజం ఉంది, కాస్త ఆలోచించి మీడియా వార్తను ప్రసారం చేయాల్సిన అవసరం ఉంది.