లక్ష్మీస్ ఎన్టీఆర్…కాదు కాదు….లక్షీస్ కోటి !

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు , లోకేష్ లను టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మనవడా అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీ పార్వతి పై ఊహించని విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమెతో కొంత కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి. ల‌క్ష్మీ పార్వ‌తి త‌న‌ను లైంగికంగా వేధిస్తుంద‌ని, త‌ల్లిలాంటి భావ‌న‌తో ఉన్న త‌నను వేధించొద్దంటూ ఎంత వేడుకున్నా ఆమె విన‌డం లేద‌ని గుంటూరు జిల్లా వినుకొండ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. అంతేకాకుండా తాను చెప్పిన‌ట్టు వింటే వైసీపీలో మంచి ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని లేదంటే ఇబ్బంది పడతావని హెచ్చరిక‌లు జారీ చేసింద‌ని కోటి వినుకొండ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఒక్క ఫిర్యాదు మాత్రమే కాదు లక్ష్మీపార్వతి చేసినట్లుగా చెబుతున్న కొన్ని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్, ఆమే మాట్లాడినవని మరికొన్ని ఆడియో టేపుల్ని కూడా పోలీసులకు అందించారు కోటి. కోటి బయట పెట్టిన అసభ్యకరంగా చాటింగ్ లో ఐ లవ్ యూ అంటూ మరికొన్ని సందేశాలు పంపినట్లుగా ఉంది. ఇక రికార్డ్ చేసిన ఆడియో టేపుల్లో ఎన్టీఆర్ పై ఏ మాత్రం గౌరవం లేకుండా లక్ష్మీపార్వతి మాట్లాడినట్లు కోటి ఆరోపిస్తున్నాడు. ఆధారాలతో ఫిర్యాదు చెయ్యటంతో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు వినుకొండ పోలీసులు.

కొన్ని విషయాలను పూర్తిగా వివరించలేక పోతున్నాం పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోలు చూడండి,

అరవై ఏళ్ల వయసులో కామమా ?