కారు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య !

Minor Love Pair Suicide Attempt

తండ్రి తనకు కారు తాళాలు ఇమ్మంటే ఇవ్వలేదన్న కారణంతో ప్రాణాలు తీసుకున్నాడు ఒక యువకుడు. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం 28ఏళ్ల శైలేంద్ర సింగ్ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు తన తండ్రిని కారు అడిగాడు. కానీ ఆయన కారు ఇచ్చేందుకు నిరాకరించి ఆ కారు తాళాలు దాచేసాడు. అయితే తనకు కారు తాళాలు ఇవ్వలేదనే కోపంతో ఉన్న అతను తన తండ్రి హాస్పిటల్ నిమిత్తం బయటకు వెళ్ళగా ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు, అయితే అతనికి దేశవాళీ తుపాకీ ఎక్కడ దొరికింది అనే విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.