శ్రీకాకుళంలో ఐదు కోట్ల పట్టివేత !

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు భారీగా నగదు పట్టుబడింది. ఓ ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగుల నిండా తీసుకెళుతున్న నగదును ఈరోజు రాజాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తమదేనని ఎవ్వరూ చెప్పకపోవడంతో బస్సులోని 30 మంది ప్రయాణికుల సహా బస్సును కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు. తాజాగా ఈ నగదు లెక్కింపును పోలీసులు పూర్తిచేశారు. ఈ మూడు బ్యాగుల్లో కలిపి రూ.5,07,88,000 ఉన్నట్లు తేల్చారు. శ్రీకాకుళం నుంచి పాలకొండకు ఈ నగదును తలరిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే బస్సులో పాలకొండ వైసీపీ నేత కుమారుడు విక్రాంత్ కూడా ఉండటంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.