కంగువ నుంచి లేటెస్ట్ అప్డేట్………..

కంగువ నుంచి లేటెస్ట్ అప్డేట్…
Cinema News

శివ దర్శకత్వంలో హీరో సూర్య నటిస్తున్న తాజా మూవీ కంగువ. స్టార్ హీరో సూర్య టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ . ఈ సినిమా సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ పోస్టర్లు, గ్లింప్స్ ‌ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవలే మేకర్స్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన కొత్త లుక్‌లో సూర్య చేతికి టాటూస్‌ కూడా కనిపిస్తున్నాయి.

కంగువ నుంచి  లేటెస్ట్ అప్డేట్…
Kanguva Movie

సూర్య మరోవైపు సెకండ్‌ లుక్‌లో ఒక వైపు వారియర్‌గా కత్తి పట్టుకుని కనిపిస్తుండగా.. మరోవైపు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ లో దిశ పటాన్ని హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే యానిమల్ మూవీ లో విలన్ పాత్రలో అద్భుతంగా నటించిన బాబీడియోల్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ అందించారు. కంగువలో కీ రోల్‌ ఉదిరన్ ని పరిచయం చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు. రక్తంతో ఉన్న చేతి లుక్‌ ని విడుదల చేస్తూ.. థ్రిల్లింగ్ లుక్‌ రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ సినిమా 3d ఫార్మాట్లో సందడి చేయనుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.