నితిన్ “తమ్ముడు” పై లేటెస్ట్ అప్డేట్!

Latest Update on Nitin's “Thammudu”!
Latest Update on Nitin's “Thammudu”!

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు హీరో నితిన్. తన రాబోయే ప్రాజెక్ట్‌లు, రాబిన్ హుడ్ మరియు తమ్ముడు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు మూవీ మళ్లీ వార్తల్లో నిలిచింది. రేపు వైజాగ్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు టీమ్ సిద్ధంగా ఉన్నట్లు ప్రొడక్షన్ టీమ్‌ కు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో నితిన్ మరియు మరికొందరు నటీనటులు చేరనున్నారు. కథానాయిక, ఇతర కీలక నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ కి కాంతార ఫేమ్ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.