Election Updates: సీట్లు తక్కువ తీసుకోవడం వెనుక పెద్ద వ్యుహం ఉంది: జనసేనాని

Election Updates: There is a big strategy behind taking less seats: Jana Senani
Election Updates: There is a big strategy behind taking less seats: Jana Senani

సీట్లు తక్కువ తీసుకోవడం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద వ్యుహం ఉందన్నారు. సీట్ల కోతపై పవన్ రియాక్ట్‌ అయ్యారు. నేను తీసుకున్న సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ, బీజేపీలు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలి….జగన్ అధికారంలో ఉండకూడదని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఒక్కడి దగ్గర ఇంత సంపద ఉండకూడదు….జగన్ అధికారంలోకి వస్తే..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికే కాదు.. దేశానికే ముప్పు అని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో జగన్ పోవాలి.. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పోవాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలి…గ్రంధి భీమవరంలో చాలా మందికి బంధువేనన్నారు. మన కులస్తుడని గ్రంధిని వదిలేయాలా..? ఓ వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల భీమవరంలో నిమ్మకాయ షోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చిందన్నారు.