సైలెంట్ గా ఓటీటీలో కి వచ్చేసిన విజయ్ ఆంటోనీ “రోమియో”..!

Vijay Antony
Vijay Antony "Romeo" who came to OTT silently..!

కోలీవుడ్ నటుడు సంగీత దర్శకుడు అలాగే దర్శకుడు కూడా అయినటువంటి విజయ్ ఆంటోనీకి తెలుగులో కూడా మంచి ఆదరణే ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అలా తను హీరోగా యంగ్ హీరోయిన్ మిర్నాలిని రవి హీరోయిన్ గా దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “రోమియో”. మరి డీసెంట్ రెస్పాన్స్ ని తెలుగు, తమిళ్ లో ఈ మూవీ అందుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Vijay Antony "Romeo" who came to OTT silently..!
Vijay Antony “Romeo” who came to OTT silently..!

స్ట్రీమింగ్ యాప్స్ ఆహా అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో లలో ఈ మూవీ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే కేవలం తమిళ్ లో మాత్రమే మూవీ ఇప్పుడు వీటిలో అందుబాటులో ఉంది. “లవ్ గురు” గా తెలుగులో రిలీజ్ కాగా ఈ వెర్షన్ ఇంకా ఓటీటీలో కి రాలేదు. మరి దీనిపై ఇంకా క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి భరత్ ధనశేఖర్ సంగీతం అందించగా మీరా ఆంటోనీ నిర్మాణం వహించారు.