“లావాజెడ్41″ఎట్ రూ.3899

“లావా జెడ్ 41” పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ ఫోన్‌ను లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్  లాంచ్‌ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.3,899 ఉండనున్నది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, యాంబర్‌ రెడ్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌ బుక్‌ లాంటి సోషల్‌ మీడియా లాంటి అన్నీ ప్లాట్‌ ఫాం లతో అందు బాటులో ఉండనుంది. యూట్యూబ్ గో వంటి డేటా యాప్ప్‌ సర్ఫింగ్‌ కు కూడా “లావా జెడ్ 41” స్మార్ట్‌ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

4వేల విభాగంలో 5అంగుళాల డిస్‌ప్లే, 5 ఎంపీ రియర్‌ కెమెరా, 1 జీబీ ర్యామ్‌, 16జీబీ  స్టోరేజ్‌ ఇంకా 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ అందిస్తూ ఉన్న ఏకైక స్మార్ట్‌ ఫోన్ ఇదే అని తేజిందర్ సింగ్ లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ తెలిపారు.