దీపావళి కానుకగా రానున్న బన్నీ పాట

దీపావళి కానుకగా రానున్న బన్నీ పాట

“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్‌ దర్శకత్వం లో నటిస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ లో వచ్చే సినిమాతో భారీ హిట్‌ కొట్టే ప్రయత్నం లో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణల నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో టబు, జయ రామ్‌, సుశాంత్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మాస్‌ ఆడియన్స్‌ ను తెగ ఆకట్టుకునేలా తమన్‌ సంగీతం లో ”రాములో..రాములా నన్నాగం చేసిందిరో” అనే పాట టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటని అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించగా కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. సోషల్‌ మీడియా లో ట్రెండ్‌ గా మారిన మొదటి పాట “సామజ వరగమన.. నిను చూసి ఆగగలనా” శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది.

చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్‌, ఫస్ట్ సాంగ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడం వల్ల సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాట టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసి పూర్తి సాంగ్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.