ఏషియన్‌ సినిమాస్‌పై ఐటీ దాడులు

ఏషియన్‌ సినిమాస్‌పై ఐటీ దాడులు

ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇంటిపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీరితో పాటు వారి స్నేహితుల నివాసాలలో కూడా ఐటీ అధికారులు  సోదాలు నిర్వహించారు .

ప్రస్తుతం ఏషియన్‌ సినిమాస్‌ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ఏషియన్ సినిమాస్‌ సంస్ద సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ మాల్‌ను ఈ మద్యనే ఏపాటు చేసింది. భారీ చిత్రాలను నైజాంలో‌ పంపిణీ చేస్తూ ఏషియన్ సినిమాస్ పేరు పైన థియేటర్స్‌ను కూడా నిర్మించింది. మహేష్ బాబుతో నే కాకుండా హీరో అల్లు అర్జున్‌తో ఇంకో మల్లీఫ్లెక్స్‌ను కూడా నిర్మించబోతోంది.