నాగార్జున మిత్రుడు, ప్రముఖ నిర్మాత మృతి…!

Telugu Producer D Shivaprasad Reddy Passed Away

కింగ్‌ నాగార్జునతోనే వరుస చిత్రాలను నిర్మించి, ఆయనతో తప్ప ఎవరితో సినిమాలు చేయను అని నిర్ణయం తీసుకున్న నాగార్జున మిత్రుడు, ప్రముఖ నిర్మాత డి. శివప్రసాద్‌ రెడ్డి శనివారం మృతి చెందారు. హృదయ సంబంధ వ్యాధితో గతకొంత కాలంగా బాదపడుతున్న శివప్రసాద్‌ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Telugu-Producer-D-Shivapras

1985లో కామాక్షి బ్యానర్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన శివ ప్రసాద్‌ ‘విక్కీదాదా’ చిత్రంతో తొలి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కెరియర్‌ చివర్లో ‘ధడ’, ‘గ్రీకువీరుడు’ చిత్రాలు పరాజయం పాలవడంతో సినీ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. నాగార్జునకు చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ నిర్మాత అయిన శివప్రసాద్‌ నాగార్జునతో మాత్రమే సినిమాలు చేస్తాను అని పలుమార్లు అనేవారు. అందుకే నాగార్జున కూడా తన మిత్రుడికే ఆ అవకాశం ఇచ్చేవారు. శివప్రసాద్‌ రెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

shivaprasad