నితిన్‌ హీరోయిన్‌ చేతిలో ముగ్గురు స్టార్‌ హీరోలు…!

Heroin-Megha-Acting-On-Thre

తమిళ సోయగం మేఘ ఆకాష్‌ తొలి చిత్రాన్ని స్టార్‌ హీరో ధనుష్‌ సరసన నటించింది. అయితే ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. చాలాసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ధనుష్‌, మేఘల చిత్రం ఈ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడికి తెలుగులో నితిన్‌ సరసన ‘లై’, ‘ఛల్‌ మోహనరంగ’ చిత్రాలలో ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను నిరాశపర్చాయి. బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. అయినా కూడా మేఘ కు యూత్‌తో క్రేజ్‌ బాగా పెరిగిపోయింది.

rajani-kanth megha

మేఘ నటించిన తొలి చిత్రం తమిళంలో ఇంకా విడుదల కాకున్నా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘పెట్ట’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సూపర్‌స్టార్‌తో నటించడం అంటే మేఘకు జాక్‌పాట్‌ తగిలినట్టే. రజనీ, ధనుష్‌లతో పాటు ఈ అమ్మడికి శింబు సరసన నటించే ఆఫర్‌ వచ్చింది. ‘అత్తారింటికి దారేది’ చిత్ర తమిళ రీమేక్‌లో పవన్‌కళ్యాణ్‌ పాత్రలో శింబు నటించనుండగా, సమంత పాత్రకు గాను మేఘను ఎంపిక చేసినట్టు కోళీవుడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ అమ్మడు రజనీ, ధనుష్‌, శింబులతో సినిమాలు చేస్తోంది. వీటిలో ఏ ఒక్కటి బ్లాక్‌ బస్టర్‌ అయినా మేఘ ఇక స్టార్‌ అయిపోవడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

danush-sambhu