ఇవి అభివృద్ది వైపు పరుగులా…వినాశనం వైపు ఉరుకులా…?

Police-Busted-Khammam-Minor

ప్రకృతి ప్రళయ తాండవం ఓ వైపు, ప్రజా ఉద్యమాల ఉన్మాదాలు మరో వైపు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఓ వైపు, ఆ ప్రసంగాలకు ఆవేశంతో రెచ్చిపోతున్న యువత మరో వైపు, ఆవేశంలో ఆలోచన నశించి పోగా, పరిస్థితులను కాష్ చేసుకుంటున్న నాయకులు అన్నివైపులా…ఇవి అభివృద్ది వైపు పరుగులా? వినాశనం వైపు ఉరుకులా? ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం? ఇదివరకిటి సమాజంతో పోలిస్తే నేడు ఎందరో విద్యావంతు లౌతున్నారు. అది ఎంతో సంతొషించ తగ్గ విషయము అందులో సందేహం ఎంతమాత్రమూ లేదు అయితే నేడు రోజురోజుకీ పెరుగుతున్న ఈ లైంగిక దాడులు చూస్తుంటే భయమేస్తోంది.గత కొద్ది రోజులుగా వార్తల ముసురు వలన తెలుగు రాష్ట్రాల్లో మీడియా తడిసి ముద్దవుతోంది.

man-raped-police

ఒకదాని వెంట మరో వార్త ఎవరో తరుముతున్నట్టు వస్తూ ఉండడంతో మీడియా ఉడ్డుగుడుచుకుంటోంది. అక్టోబరు రెండో తేదీన పదవీవిరమణ చేసిన భారత అత్యున్నత న్యాయస్థానం  ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, కొద్ది రోజుల వ్యవధానంలోనే అతి ముఖ్యమైన అంశాలలో కీలకమైన పలు తీర్పులను వరసగా వెలువరించి మీడియాకు మరింత పని ఒత్తిడి కలిపించారు.స్వలింగ సంపర్కం తప్పు కాదంటూ ఇచ్చిన తీర్పుపై రగిలిన రగడ చల్లారక ముందే వివాహేతర సంబంధాలు శిక్షార్హమైన నేరం కాదంటూ సుప్రీం ఇచ్చిన మరో తీర్పు అయోధ్య వివాదం పై తాజాగా ఇచ్చిన మరో తీర్పును మరుగున పడేసింది. ఇదిలా ఉండగానే శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై వున్న నిషేధాన్ని సుప్రీం కొట్టివేయడం సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలకు ఊపిరి ఊదింది. భీమా కొరేగాం కేసుకు సంబంధించి వరవరరావు గృహ నిర్బంధాన్ని మరో మాసం పాటు పొడిగిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం కూడా ఈ వరుస లోనిదే. అయితే ఈ నిర్ణయాలతో ఆయన ఏమి బావుకున్నట్టు ఎక్కడో పాశ్చాత్య సంస్కృతి తెచ్చి మన నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

murder

దీనివలన మన భావితరాలకు నష్టమే కానీ లాభం లేదు.ఈ భయంకరమైన వాదాలు, లాజిక్కులూ చదివేవారికి చిరాకు తెప్పించవచ్చు కానీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? కేవలం కొంత మంది ఇష్టపూర్వకంగా చేసుకునే సంపర్కాన్ని కాదనడానికి, వారికీ అందరిలా జీవించే హక్కును నిరాకరించడానికి మనకు హక్కు లేదు కానీ ఇలాంటి తీర్పులు ప్రజలని ముఖ్యంగా పిలల్లను ఎలాంటి సంఘర్షణకు గురిచేస్తున్నాయో నేది ఖమ్మంలో జరిగిన ఒక ఘటనే సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన తలారి వెంకటేశ్వర్లు, వినోదల కుమారుడైన నిందితుడు ఖమ్మంలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. అయితే, స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన నిందితుడు అక్టోబరు 23న జోసఫ్‌ అనే నాలుగో తరగతి కుర్రవాడ్ని సైకిల్‌పై తిప్పి వసృతి గృహానికి తీసుకొచ్చాడు.

murder-case
ఎవరూ లేకపోవడంతో జోసఫ్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి జోసెఫ్ అంగీకరించకపోవడంతో విషయం బయటకు వస్తుందని అతడిని హత్యచేశాడు. జోసెఫ్‌పై టవల్ కప్పి రాయితో కొట్టి హతమార్చాడు. తలను ట్రంకు పెట్టెకేసి బలంగా బాదాడు. దీంతో జోసెఫ్ అక్కడికక్కడే మరణించాడు. అసలు ఆడవారి లైంగిక వేధింపుల గురించి లెక్చర్లు ఇచ్చే మహానుభావులకి ఇలాంటివి కనపడవు కాబోవు. ఏది ఏమైనా ఇలాంటి విసృంఖల సంస్కృతిని కట్టి చేయాలి, ఈ నేపధ్యంలో పోర్న్ సైట్లు బ్యాన్ చేసిన కేంద్రానికి నిజంగా పాదాభివందనాలు.