మరో మెగా హీరో ఎంట్రీ… గ్రేట్‌ కాంబో ఫిక్స్‌…!

Sai Dharam Tej Brother Vaishnav Tej Tollywood Entry

మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు సినిమా రంగంలో తన ప్రస్థానాన్ని ఎంతలా ఏర్పరుచుకున్నాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్‌ సాధించిన ఇమేజ్‌తో తన వారసులుగా చాలామంది ఆయన కుటుంబ సభ్యులు సినీ రంగంలోకి ప్రవేశించారు. ఈ మెగా హీరోలంతా కూడా తమకు తగిన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు నచ్చే విధంగా నటిస్తూ చిరు మెగా బ్రాండ్‌ను నిలబెట్టారు అని చెప్పకనే చెప్పవచ్చు. కెరియర్‌లో కొన్ని సూపర్‌ హిట్లు, కొన్ని డిజాస్టర్లు అనేవి ఏ స్టార్‌ హీరోకు అయినా తప్పవు. మెగా హీరోల విషయంలో కూడా కొన్ని ఇలాగే ఉన్నాయి. అయినా కూడా మెగా బ్రాండ్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ మెగా పవర్‌ చూపిస్తున్నారు. తాజాగా మరో మెగా హీరో కూడా రంగంలోకి దిగడానికి సిద్దమవుతున్నాడు.

Vaishnav-Tej

చిరు లుక్స్‌లో కనిపించి, చిరు మాస్‌ డైలాగులు, మాస్‌ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేసే సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ ఎంట్రీ గురించి గతకొంత కాలంగా చర్చ జరుగుతున్నా కూడా మంచి కథ కోసం చాలా సమయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎట్టకేలకు వైష్ణవ్‌ తేజ్‌ తొలి చిత్రం ఫిక్స్‌ అయ్యిందని సమాచారం. ఈ చిత్రాన్ని సుకుమార్‌ అసిస్టెంట్‌ బుచ్చిబాబు తెరకెక్కించనుండగా మైత్రీ మూవీ మేకర్స్‌ మరియు సుకుమార్‌లు కలిసి నిర్మించనున్నారు. బుచ్చిబాబు ‘రంగస్థలం’ చిత్రానికి కూడా పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్ర అధికారిక ప్రకటన రానుంది.

Sai-Dharam-Tej