అనగనగా ఓ ప్రేమకథ మూవీ ట్రైలర్

అనగనగా ఓ ప్రేమకథ మూవీ ట్రైలర్ - Telugu Bullet

హీరో అశ్విన్ జె విరాజ్, దర్శకుడు ప్రతాప్, సంగీత దర్శకుడు అంజన్ ఈ సినిమాతోనే అరంగేట్రం చేస్తున్నారు. అయితే, హీరోయిన్ రిద్ధి కుమార్ కి మాత్రం ఇది రెండో సినిమా, అది కూడా ఈ సంవత్సరంలోనే. తన మొదటి సినిమా వచ్చేసి రాజ్ తరుణ్ హీరోగా చేసిన ‘లవర్’. అందులో తను హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. అలాగే, నిర్మాత రాజు కూడా ఈ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అంటే, 2001లో, జగపతి బాబు, లయ జంటగా నటించిన ‘నాలో ఉన్న ప్రేమ’ సినిమానే ఈయనే నిర్మించారు. మళ్ళీ 18 ఏళ్ళ తరువాత ఇదిగో ఇలా ‘అనగనగా ఓ ప్రేమకథ’ తో వచ్చారు.

అనగనగా ఓ ప్రేమకథ మూవీ ట్రైలర్ - Telugu Bullet

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఇది ఫుల్ మాస్ అంశాలతో కమర్షియల్ గా కనిపిస్తుంది. హీరో ఫైట్స్, డైలాగ్స్ బాగానే చెప్తున్నాడు, పైగా ఈ సినిమాలో హీరో పాత్ర రోమియోలా అనిపిస్తుంది. అలాగే, కామెడీ, ఫైట్స్, రొమాన్స్ తో ట్రైలర్ లో ఎక్కువ భాగం నిండిపోయింది. ట్రైలర్ లో టిల్లు వేణు చెప్పిన డైలాగ్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న వాటికి సంబంధించి ఉంటుంది. మొత్తానికి, ట్రైలర్ చూడడానికి ఎంటర్టైనింగ్ గానే ఉంది, ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అనగనగా ఓ ప్రేమకథ మూవీ ట్రైలర్ - Telugu Bullet

నటీనటులు: అశ్విన్ జె విరాజ్, రిద్ధి కుమార్
దర్శకుడు: ప్రతాప్ తాతంసెట్టి
నిర్మాత: కె.ఎల్.ఎన్ రాజు
సమర్పణ: కే.సతీష్ కుమార్
సంగీతం: కె.సి.అంజన్
సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
బ్యానర్: 1000 లైట్స్ మీడియా