చిరు కోసం కొత్త ప్రయత్నాలు… ఫలిస్తాయా…?

Chiru New Dance Steps In Sye Raa Narasimha Reddy Movie

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైది నెం. 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో కూడా యువ హీరోలు షాకయ్యే విధంగా స్టెప్పులతో, నటనతో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఒక చారిత్రాత్మక చిత్రం చేయాలని భావించిన దానికోసం చాలా సమయాన్ని వెచ్చించాడు.

syee-raa-movie

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి జీవిత గాథతో ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మాస్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అందాల ముద్దుగుమ్మ నయనతార ఈ చిత్రంలో చిరు సరసన నటిస్తుండగా తమన్నా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

syee-raa-moviethamanna

చిరు అనగానే అభిమానులు ఆయన వేసే స్టెప్పులనే ఎక్కువగా ఊహించుకుంటారు. అయితే ‘సైరా’ చారిత్రాత్మక చిత్రం కాబట్టి ఎక్కువ పాటలు ఉండవంటూ వార్తలు వచ్చాయి. కానీ కథ నేపథ్యంలోనే పాటలు, డ్యాన్స్‌లు ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నామని, ఈ విషయంలో అభిమానులు నిరుత్సాహపడవద్దు అని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రంలో రెగ్యులర్‌ స్టెప్పుల్లా కాకుండా విభిన్నంగా ఉండాలని చిరు డాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ మాస్టర్‌కి సూచించాడట. దాంతో శేఖర్‌ మాస్టర్‌ కొత్త కొత్త స్టెప్పులను చిరుపై ప్రయోగించబోతున్నట్టు తెలుస్తోంది. మరి కొత్త స్టెప్పులు చిరుకు సెట్‌ అవుతాయా? చిరు కొత్తగా ట్రై చేస్తే వర్కౌట్‌ అవుతుందా అనే సందేహాలు విశ్లేషకుల్లో వ్యక్తం అవుతున్నాయి.

syeeeraaa-movie-narashima-r