RAM కు అరుదైన కానుక ఇచ్చిన LAXMAN

రాముడి పుట్టిన రోజున లక్ష్మణుడి అపూర్వ కానుక. కేటీఆర్ బర్త్ డే పురస్కరించుకుని తన పుట్టిన తేదీ 24 07 76 అంకె కలిగిన వివిద డినామినేషన్లతో కూడిన కరెన్సీతో పాటు కేటిఆర్ చిన్ననాటి నుండి ఇప్పటివరకూ అపురూప చిత్రాలని సేకరించి ఆ జ్ణాపికని చిత్ర దర్శకుడు బందూక్ లక్ష్మణ్ అందజేశారు.

కేటీఆర్ జన్మదినమైన 24.07.76 రోజుతో కూడిన వివిద కరెన్షీ నోట్లని గత రెండు సంవత్సరాలుగా సేకరించి ఈ 2020 జూలై 24న కేటీఆర్ 44వ పుట్టినరోజున అందజేస్తున్నట్టు తెలిపారు. రూపాయి నోటు, ఐదురూపాయల నోటు, పదిరూపాయలనోటు, ఇరవైరూపాయల నోటు, యాబై రూపాయల నోటు, వంద రూపాయలు అలాగే రెండువందల రూపాయల నోట్ల వరకూ 24.07.76 ఒకే నంబర్ గల నోట్లని సేకరించారు.

దీంతో పాటు కేటీఆర్ చింతమడకలో బుడిబుడి అడుగులు వేసింది మెదలు నేటి యువనాయకుడుగా ప్రపంచస్థాయిలో ఎదిగే వరకూ ప్రతీ మధురమైన క్షణాన్ని పోటోల రూపంలో సేకరించి, వాటిని చింతమడకలోని కేసీఆర్ ఇంటి బ్యాగ్రౌండ్తో అందమైన పోటో ప్రేముగా రూపొందించి వాటిలో 240776 అంకె కలిగిన కరెన్షీ నోట్లని పొందుపరిచిన తీరు కేటీఆర్ అభిమానులని అలరిస్తుంది. ఎన్నో ప్రయాసలకి ఓర్చి సేకరించిన ఈ అరుదైన కానుకని కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందజేస్తున్నందుకు బందూక్ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిపై ఎంతటి ప్రేమ ఉంటే ఇంతటి ఓర్పుతో సేకరణ చేయగలరో ఊహించుకుంటూనే బందూక్ లక్ష్మణ్ మనసు తెలిసిపోతుంది.