కేటీఆర్ కు విషెస్ తెలిపిన చిరంజీవి

కేటీఆర్ కు విషెస్ తెలిపిన చిరంజీవి

ఈరోజు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మరియు వారి పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు కావడంతో అనేక మంది రాజకీయ నాయకులు సహా సినీ తారలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేటీఆర్ కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరి ఇరువురి కుటుంబాలకు సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. సాన్నిహిత్యంతో తన మాటలను అక్షరాలలో తెలిపారు.

“మీరు అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉండటం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి సాయం చెయ్యడం ఇవన్నీ ఇలాగే మరిన్ని సంవత్సరాలు చెయ్యాలని అందుకు తగ్గ శక్తి ఎప్పుడూ నీకు చేకూరాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా” అని చిరు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.