ప్రయాణికిలు షాక్.. లవ్ ఫెయిల్ అని… విమానం కిటికీ బద్దలు..

ప్రాణంగా ప్రేమించిన ఆ ప్రేమ దక్కకపోతే ఆ ప్రేమ తాలూకూ ప్రకంపణలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. అదేమంటే.. ప్రేమించిన వాడే తనను కాదని అన్నప్పుడు.. ఈ జీవితం తనకెందుకు అనుకున్నారు. అలాంటి సమయాల్లో ఏం తోచదు. అది సహజమే. అలాంటి వేళలోనే అనాలోచిత నిర్ణయాలతో జీవితాలు ధ్వసం చేసుకుంటుంటారు ప్రమికులు.

తాజాగా ఓ యువతి.. తన ప్రేమ విఫలమైందని ఎంతో వేధనకు లోనైంది. దాంతో విమానం కిటికీని పగులగొట్టింది. మే 25వ తేదీన లీ అనే 29 ఏళ్ల యువతి లూంగ్‌ ఎయిర్‌లైన్స్‌లో గ్జినింగ్‌ నుంచి యాచ్చెంగ్‌కు బయల్దేరింది. ఉన్నట్టుండి విమానం కిటికీ పై పంచుల వర్షం కురిపించింది. అప్రమత్తమైన విమాన సిబ్బంది.. ఇతర ప్రయాణికులు ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే విమానం కిటికీ స్వల్పంగా పగిలిపోయింది. దీంతో విమానాన్ని జెంగ్చూ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. కాగా అక్కడ లీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. జరిగిన విషయాన్ని ఆమె వెల్లడించింది. తన ప్రేమను ఓ యువకుడు తిరస్కరించినందుకు బాధ పడుతున్నానని.. అందుకే అలా చేయాల్సి వచ్చిందని వివరించింది. కాగా తీవ్ర మనోవేదనకు గురౌతున్న తాను దాన్నుంచి బయటపడాలని.. విమానం ఎక్కేముందే ఆల్కహాల్‌ సేవించానని తెలిపింది. కాగా ప్రేమ విఫలమైందనే బాధతోనే.. మద్యం మత్తులో ఉన్న తాను ఏం చేశానో అర్థం కాలేదని ఆమె స్పష్టం చేసింది.