ప్రత్యక్ష సాక్షం: ఒడిశాలో వృద్ధురాలికి ఫించన్ కోసం పాట్లు…..

కూటికోసం కోటి తిప్పలు అన్నట్లు.. సర్కార్ ఇచ్చే పించన్‌ కోసం కూడా నానాతిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన ఓ ఘటన గుండెలను పిండేస్తుంది. నిరుపేదల కోసం ప్రభుత్వం ఇచ్చే ఫించన్ కోసం ఓ వృద్ధురాలి ఘటన గుండెలను పిండేస్తుంది.

ఒడిశాలో ఓ ముసలి అవ్వకు పెన్షన్ ఇప్పించేందుకు వాళ్ల కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు. ఫించన్ తీసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయానికి స్వయంగా వెళ్లి తాము బ్రతికే ఉన్నామని నిరూపించుకోవాలి. కానీ ఒడిశాకు చెందిన వందేళ్ల బామ్మగారు చాలా కాలం నుంచి మంచం పట్టారు. లేచి రెండడుగులు వేసే పరిస్థితి లేదు. ఓపిక లేని పండు ముదుసలి. ఆమెను అధికాలకు ప్రత్యక్షంగా బ్రతికే ఉందని చూపించేందంకు తీసుకు వస్తున్న ఫోటో వైరల్ అవుతోంది.

అయితే ఆమె కుటుంబ సభ్యులు… అవ్వను మంచంలోనే ఉంచి… ఫించన్ కోసం తీసుకెళ్లారు. నులకమంచంపై తల్లిని ఉంచి… రోడ్డు మీద లాగుతూ ఆమె కుమార్తె అవస్థ పడ్డారు. ప్రభుత్వ అధికారులే ఇంటికొచ్చి ఫించన్ ఇచ్చే విధానం ఒడిశాలో లేకపోవడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఏపీ నాయకులు, ప్రజలు విపరీతంగా వైరల్ చేశారు. మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఇంటికే పెన్షన్ ఇస్తుండటంతో ఇలాంటి అవస్థలు మా రాష్ట్రానికి లేవని తెలిపారు.