ప్రేమించడం లేదని.. అమ్మాయిని బీరు బాటిల్ తో…….

తెలంగాణలో ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. వరంగల్‌లో ప్రేమికుడు ఉన్మాదిలా మారి ఇంటర్మీడియెట్ చదువుతోన్న బాలికను బీరు సీసాతో పొడిచేశాడు. ఓ యువకుడు వరంగల్ నగరంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. తనను దూరం పెట్టిందన్న అక్కసుతో ప్రియురాలిపై ఏకంగా బీరు సీసాతో దాడి చేశాడు. వరంగల్‌ లేబర్‌కాలనీకి చెందిన యువతి ఈ మధ్య ఇంటర్‌ ఫస్టియర్ పూర్తి చేసింది. అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బయటకు రానీకుండా కట్టడి చేశారు. అంతేకాకుండా సెల్‌ఫోన్ కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ప్రియుడి పిచ్చి పరాకాష్టకు చేరింది. ప్రియురాలితో ఒక్కసారి కూడా మాట్లాడలేకపోతున్నానే అని ప్రియుడి రెచ్చిపోయాడు.

అయితే అమ్మాయి ఇంట్లో ఇలా జరిగిందని తెలియని నిఖిల్ ప్రియురాలు తనను దూరం పెట్టిందని కక్ష పెంచుకోసాగాడు. ఇక ఆ అమ్మాయి తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే ఆలోచనతో ఆమె ప్రాణం తీసేందుకు ప్రయత్నించాడు. తాజాగా ప్రియురాలి ఇంటికి వెళ్లి బీరు సీసా పగులగొట్టి దానితో ఆమెను అనేకచోట్ల పొడిచేశాడు. కాగా బాధితురాలు కేకలు వేయడంతో అతడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిని యువతిని కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు నిఖిల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా సీఐ నరేశ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకొని ఆ యువకుడి విచారిస్తున్నారు. ఆ ఘటన కారణంగా వరంగల్ నగరం ఒక్కసారిగా షాక్ కి గురైంది.