ముద్దు సీన్స్‌ కాదన్నందుకే నో ఛాన్స్‌

Madonna Sebastian Lost Films Due To Liplock Scenes

మలయాళం మరియు తెలుగులో ‘ప్రేమమ్‌’ చిత్రంతో గుర్తింపు దక్కించుకున్న మడోనా సెబాస్టియన్‌ ఆ చిత్రం తర్వాత అవకాశాలను దక్కించుకోలేక పోయింది. తాజాగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్న ఈమె ఇకపై వరుసగా చిత్రాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రేమమ్‌ చిత్రం విడుదలైన వెంటనే రెండు మూడు పెద్ద చిత్రాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. కాని ఆ చిత్రాల్లో గ్లామర్‌ పాత్రను పోషించడంతో పాటు ముద్దు సీన్స్‌ ఉన్నాయి. అందుకే ఆ సీన్స్‌కు నో చెప్పి, సినిమాలకు కూడా నో చెప్పాను. స్కిన్‌ షో చేస్తే భారీ ఆఫర్లు వస్తాయి. కాని తనకు అలా ఇష్టం లేదని, నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలు చేస్తు కెరీర్‌ను కొనసాగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

ముద్దు సీన్స్‌కు నో చెప్పడం వల్ల తాను సినిమాలు కోల్పోయినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ మడోనా ఇకపై చిన్న చిత్రాల్లో కూడా నటించేందుకు సిద్దం అంటూ ప్రకటించింది. పెద్ద సినిమాల్లో స్కిన్‌ షో డిమాండ్‌ చేస్తున్న కారణంగా చిన్న చిత్రాల్లో నటించి తన సత్తా చాటుతాను అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే తెలుగులో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఆ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని, త్వరలోనే తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. సినిమాల్లో తన అవసరం ఉన్నంత కాలం నటిస్తాను, అంతే తప్ప అవకాశాల కోసం గ్లామర్‌ డాల్‌ పాత్రలు పోషించను అంటూ తేల్చి చెప్పింది. ఇలా చేస్తే సినిమాల్లో కొనసాగడం ఎక్కువ కాలం మీ లేదని, గ్లామర్‌ పాత్రలు చేయని హీరోయిన్స్‌కు ఈ మద్య అవకాశాలు కూడా అంతగా లేవు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.