‘మహానటి’ మే కు షిఫ్ట్‌?

Mahanati Movie to be Postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న సావిత్రి జీవిత కథాంశంతో ‘మహానటి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చారు. అయితే మార్చి 30వ తేదీన రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. మార్చిలో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తే ఏప్రిల్‌ మొత్తం పెద్ద సినిమాల హడావుడి ఉండనుంది. అప్పుడు మే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

మార్చి చివర్లో విడుదల కాబోతున్న ‘రంగస్థలం’ ఏప్రిల్‌ రెండవ వారం వరకు సందడి చేయనుంది. ఆ తర్వాత ‘భరత్‌ అను నేను’ చిత్రంతో మహేష్‌బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నా కూడా మరో రెండు వారాల పాటు దుమ్ము దులిపే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలు ఏప్రిల్‌లో సందడి చేయనున్న నేపథ్యంలో మే మొదటి వారంలో ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదల కాబోతుంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అందుకే మే రెండవ వారం తర్వాత ‘మహానటి’ని విడుదల చేయడం ఉత్తమం అని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే ‘రంగస్థలం’ లేదా ‘భరత్‌ అను నేను’ చిత్రాల్లో ఏదైనా చిత్రం ఫలితం తారు మారు అయితే వెంటనే ‘మహానటి’ని రంగంలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.