పిక్‌ టాక్‌: తండ్రి ఎలాగో కూతురు అలాగే…!

Mahesh Babu Family Vacation Photos

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా కూడా పర్సనల్‌గా చాలా సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తాడు. వరుస చిత్రాల షూటింగ్‌లో పాల్గోంటున్నా మహేష్‌ విరామం వచ్చినప్పుడల్లా ఫ్యామిలితో కలిసి విదేశి ట్రిప్‌కు వెళతారు. అలా హాలిడే ట్రిప్‌కు వెళ్లే మహేష్‌ కుటుంబం ఏదో గుట్టుగా గడిపేసి రాకుండా అక్కడ వారు ఎంజాయ్‌ చేసిన ఫొటోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. మహేష్‌బాబు వివాహం కాకముందు బాగా సిగ్గు పడుతుండే వాడు, బయట కార్యక్రమాలకు రావడానికి పెద్దగా ఇష్ట పడేవాడు కాదనే విషయం తెల్సిందే. కానీ నమ్రతను వివాహమాడాక మహేష్‌లో చాలా మార్పులు వచ్చాయి.

maheshbabu-doughters

సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా కూడా తరుచుగా హాలిడే ట్రిప్‌కు వెళ్లే మహేష్‌ ఫ్యామిలి ఇటీవలె విదేశాలకు వెళ్లి వచ్చారు. తాజాగా అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చాలా స్టైలిష్‌ లుక్‌లో మహేష్‌ బాబు ఉండగా అంతే క్యూట్‌గా పక్కన సితార కూడా ఉంది. సితారకు చిన్నప్పటి నుండే మంచి ఫాలోయింగ్‌ ఉన్నది.

maheshbabu

తాజాగా నమ్రత మహేష్‌, సితూ బేబిల ఫొటో షేర్‌ చేస్తూ… తండ్రి ఎలాగో కూతురు అలాగే అని పెట్టింది. స్టైలిష్‌ లుక్‌లో ఉన్న ఈ తండ్రి కూతుళ్ల ఫొటో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. మహేష్‌ ప్రస్తుతం వంశీ పైడిపల్లి తెరకెక్కించే ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నాడు.

naheshbabu-sons