మహేష్ మేనకోడలు టాలీవుడ్ ఎంట్రీ…

Mahesh Babu Niece Jahnavi to do special role in Sundeep Kishan Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా తన వారసులు అయిన రమేష్ , మహేష్ బాబు ను వెండితెరకు పరిచయం చేసాడు. రమేష్ బాబు అడపాదడపా సినిమాలు తీసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించటం లో విఫలం అయ్యాడు. కానీ మహేష్ చిన్నప్పటినుంచే అందరి ఆదరాభిమానాలను పొంది, ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్నాడు. ఆతర్వాత మహేష్ బాబు సోదరి మంజుల కూడా తెరపై హీరోయిన్ అవ్వాలని అనుకుందట. మొదట్లో అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ అవి వర్కవుట్ కాలేదు.

Mahesh-Babu-Niece-Jahnavi

ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటిగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల. కానీ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ హీరోయిన్ అవ్వాలనే కోరిక అలాగే ఆమె మనసులో ఉండిపోయింది. అయితే ఆ బాధను కొంతలో కొంత అయినా తీర్చుకోవడానికి ఆమె తన కూతురు జాన్విని రంగలోకి దింపనుందట. ఎలాగైనా తన కూతురు హీరోయిన్ గా చేయించాలని ఇప్పటి నుండే వెండితెరను పరిచయం చేయిస్తోంది.

Mahesh sister Manjula Dughter Jahnavi to do special role in Sundeep Kishan Movie

ప్రస్తుతం మంజుల సందీప్ కిషన్ హీరోగా ఒక మూవీ కి దర్శకత్వం వహిస్తుంది. ఈ లవ్ స్టోరీ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ని తన కూతురు చేత చేయించనున్నారట మంజుల. రీసెంట్ గా మంజుల కూతురు జాన్వి షూటింగ్ స్పాట్ లో సందీప్ పక్కనే కనిపించి ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటివరకు తన కూతురిని షూట్ లోకి రానివ్వలేదు. కానీ ఇప్పుడు మొదటి సారి తను షూటింగ్ లోకి రాగానే నర్వస్ గా అనిపించిందట. కానీ మొదటి సీన్ షూట్ చేసిన తర్వాత తనపై నాకు నమ్మకం పెరిగిందని. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి మహేష్ ను గుర్తు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చింది మంజుల. ఈ సినిమా తరువాత అయిన మహేష్ మేనకోడలు హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తల్లి కోరికను నేరవేరుస్తుందేమో చూడాలి.