కొత్త పెళ్లి కొడుకు నితిన్…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మోస్ట్ ఎలిజిబుల్ బాచులర్స్ లో టాలీవుడ్ హీరో నితిన్ ఒకరు. సినిమా వెంట సినిమా చేసుకుంటూ వెళ్లడం తప్ప పెళ్లి సంగతి ఎత్తడం లేదు ఈ హీరో. పెళ్లెప్పుడవుతుంది బాబూ అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కానీ నితిన్ కొత్త పెళ్లి కొడుకు అయ్యాడు. నిజంగా కాదులెండి సినిమాలో. త్రివిక్రమ్ సినిమాకు ముందు ఎన్టీఆర్ శతమానంభవతి దర్శకుడు సతీష్ వేగేశ్న తో ఓ సినిమా చేస్తాడని పుకార్లు వచ్చాయి. ఆ సినిమానే ఇప్పుడు నితిన్ హీరోగా చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.

Nithin Satish Vegesna and Dil Raju team up

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద చేస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస కళ్యాణం అని పేరు పెట్టారు. 2018 మార్చి లో మొదలయ్యే ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తారు. ఎన్టీఆర్ చేయాల్సిన పాత్రను దక్కించుకున్న నితిన్ ఈ సినిమాలో పెళ్లి కొడుకు అవతారం ఎత్తుతాడు అని తెలుస్తోంది. మొత్తానికి రియల్ లైఫ్ లో పెళ్లి లేట్ అయినా ఇలా ఆ ముచ్చట తీర్చుకుంటున్నాడు నితిన్. టాలీవుడ్ లో స్టైలిస్ట్ , కాస్ట్యూమ్ డిజైనర్ గా అందరికీ పరిచయం అయిన నీరజ కోన కూడా ఇదే విషయాన్ని కాస్త సరదాగా చెబుతూ ఈ సినిమా తర్వాత అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతారని నితిన్ ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

neeraja Kona Tweet on Nithin Movie