ఆ అమ్మ పాదాల దగ్గర లక్ష్మీపార్వతి జీవితం.

Goddes Chengalamma Puja To Laxmi's Veera Grandham Movie Script

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ బయోపిక్ గురించి అందరూ ఎదురు చూస్తుంటే ముందుగా లక్ష్మీపార్వతి జీవిత చరిత్రే సినిమాగా వచ్చేట్టుంది. ఎన్టీఆర్ బయోపిక్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు వర్ధంతి జనవరి 18 న ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఇక ఆ సినిమాకు పోటీగా “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ ప్రకటించిన రాము దాన్ని పక్కనబెట్టి నాగ్ తో సినిమా చేస్తూ బిజీ అయిపోయారు. ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ కి పోటీగా “ “ “లక్ష్మీస్ వీరగ్రంధం “ ప్రకటించిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈ దర్శకుడు లక్ష్మీపార్వతి జీవితం తో ముడిపడిన అన్ని ప్రాంతాలు తిరిగి సమాచారం సేకరించారు. ఈ క్రమంలో ఆమె మాజీ భర్త వీరగంధం సుబ్బారావు స్వగ్రామం కూడా వెళ్లి వచ్చారు.

ఇలా అన్ని చోట్ల తిరిగి సేకరించిన సమాచారం ఆధారంగా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి “లక్ష్మీస్ వీరగ్రంధం “ స్క్రిప్ట్ పని పూర్తి చేశారు. ఆ స్క్రిప్ట్ ను నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట లో వెలసిన శ్రీ చెంగాలమ్మ అమ్మవారి పాదాల చెంత పెట్టి ఆమె ఆశీస్సులు అందుకున్నారు. ఈ సినిమా షూటింగ్ నిర్విఘ్నంగా జరగడంతో పాటు భారీ విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సినిమా ఆపాలని లక్ష్మీపార్వతి విశ్వప్రయత్నం చేస్తోందని ఇప్పటికే కేతిరెడ్డి అంటున్నారు. ఆమె తనపై హత్యాయత్నం చేయించవచ్చని కూడా ఆయన ఇప్పటికే రెండు తెలుగు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు. ఆ ఇబ్బందులు ఏవీ సినిమాకు ఆటంకం కాకూడదని భావిస్తున్న కేతిరెడ్డి అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం స్థానికంగా కూడా చర్చకు దారి తీసింది.