ఎన్టీఆర్ ఫ్యామిలీ జోలికి వస్తారట…

New Movie announced on NTR family fighting sequence episodes in NTR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ బయోపిక్ అని నందమూరి బాలయ్య ఏ ముహూర్తాన అన్నాడో గానీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మీద తీసే సినిమాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం పేరిట మొదలైన మూడు సినిమాలు మూడు వేర్వేరు పాయింట్స్ మీద దృష్టి పెట్టాయి. ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య హీరోగా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సినీ జీవితం, ఆయన సీఎం కావడం, నాదెండ్ల ఎపిసోడ్, తిరిగి సీఎం కావడం వంటి విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మిగిలిన అన్ని చిత్రాలతో పోలిస్తే బడ్జెట్ ఎక్కువ.

ఇక రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన” లక్ష్మీస్ ఎన్టీఆర్ “ లో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం తరువాత జరిగిన ఘటనలు, వారి వివాహం, వైస్రాయ్ ఎపిసోడ్ వంటి వాటికి పెద్ద పీట వేయబోతున్నారు. ఇక ఎన్టీఆర్ మీద వస్తున్న సినిమాల్లో మూడో కోణం “లక్ష్మీస్ వీరగ్రంధం “. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలోకి రాక ముందు లక్ష్మీపార్వతి జీవితంలోని ఘట్టాల్ని టచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల మీద ఇప్పటికే వివాదాలు వస్తున్నాయి. లక్ష్మీపార్వతి ఓ సినిమాకి ఎస్ అంటోంది. ఇంకో సినిమాకి నో అంటోంది. “లక్ష్మీస్ వీరగ్రంధం “ సినిమా ఆపకపోతే కేసులు వేస్తానంటూ లక్ష్మీపార్వతి హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సినిమా వెనుక చంద్రబాబు, బాలయ్య హస్తం ఉందని ఆమె డౌట్. తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆమె ఇదే విషయం చెప్పుకుని బాధపడుతున్నారు.

ఈ ఎపిసోడ్ ఇలా నడుస్తుండగానే ఫిలిం నగర్ లో ఇంకో పుకారు షికారు లోకి వచ్చింది. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఇచ్చే నాటికి ఆయన పరిస్థితి, కొడుకులు, కూతుళ్లు ఆయనతో వ్యవహరించిన తీరు మీద ఇంకో సినిమా తీసే అవకాశం ఉందట. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా చిత్ర సీమలో వివాదాస్పద సినిమాలు తీసే ఓ నిర్మాత ఈ సినిమా మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా వెనుక లక్ష్మీపార్వతి హస్తం ఉందన్న వ్యాఖ్యలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా యుద్ధం ఎన్టీఆర్ ఫ్యామిలీ జోలికి కూడా వెళ్లేట్టు చేసింది.