మహేష్‌తో రామారావు..!

Mahesh Babu Upcoming Films With Ramarao

1980,90లలో కేఎస్‌ రామారావు ఎన్నో సూపర్‌ హిట్స్‌ను నిర్మించాడు. అభిరుచి కలిగిన నిర్మాతగా పేరున్న ఈయన గత కొంత కాలంగా సినిమా నిర్మాణంకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈయన తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందిన తేజ్‌ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం అవుతుంది. ఇక నిర్మాత కేఎస్‌ రామారావు వరుసగా చిత్రాలను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈయన తర్వాత చిత్రాన్ని మహేష్‌బాబుతో నిర్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

గతంలో కేఎస్‌ రామారావు నిర్మించిన చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు ఉంది. అందుకే ఈయనకు యంగ్‌ హీరోలు ఈజీగానే డేట్లు ఇస్తారనే టాక్‌ వినిపిస్తుంది. మహేష్‌బాబుతో ఈయన తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో అటు వైపు నుండి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి కేఎస్‌ రామారావు నిర్మాణంలో వరుసగా ఇకపై సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని అశ్వినీదత్‌, దిల్‌రాజుల బ్యానర్‌లో చేస్తున్న విషయం తెల్సిందే. మహేష్‌ 26వ చిత్రంను కేఎస్‌ రామారావు నిర్మాణంలో ఉంటుందేమో చూడాలి. మహేష్‌ బాబు 26వ చిత్రంలో కాకున్నా 27వ చిత్రం అయినా కేఎస్‌ రామారావు నిర్మాణంలో తెరకెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది.