తెలుగమ్మాయితో పెళ్లి.. విశాల్‌ క్లారిటీ

Vishal Clarity About Her Marriage With Tollywood Girl

తమిళ హీరో విశాల్‌ గత కొంత కాలంగా హీరోయిన్‌ వరలక్ష్మితో ప్రేమాయనం సాగిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ప్రేమ విషయంలోనే శరత్‌ కుమార్‌తో కూడా ఈయన గొడవ పడ్డట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. శరత్‌ కుమార్‌తో విభేదాలు ఉన్నా కూడా వరలక్ష్మితో ఈయన చాలా క్లోజ్‌గా ఉండేవాడు. ఆ కారణంగానే ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని అంతా భావించారు. కాని తాజాగా వీరిద్దరు కూడా తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ఒక తెలుగు అమ్మాయితో విశాల్‌ వివాహంకు రంగం సిద్దం అవుతుందని, 40 ఏళ్ల విశాల్‌ తెలుగు అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలపై విశాల్‌ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

విశాల్‌ ప్రస్తుతానికి వివాహంకు సంబంధించి ఎలాంటి ఆలోచన చేయడం లేదని, ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కూడా నడిగర్‌ బిల్డింగ్‌ నిర్మాణంపైనే ఉందంటూ చెప్పుకొచ్చారు. తెలుగు అమ్మాయిని ఎంపిక చేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆ సమయంకు పెళ్లి ఎవరిని చేసుకుంటాడో అనే విషయం కూడా చెప్పలేం అంటూ విశాల్‌ సన్నిహితులు పేర్కొన్నారు. విశాల్‌ కుటుంబ సభ్యులకు తెలుగు రాష్ట్రం ఏపీలో బంధవులు ఉన్నారు. గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను విశాల్‌కు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ విషయంలో క్లారిటీ కుటుంబ సభ్యుల నుండి అయితే రావడం లేదు. విశాల్‌కు సన్నిహితంగా ఉండే మీడియా మిత్రులు మాత్రం ఆ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు.